ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాల వేదిక

పని వచ్చినోడు పస్తులుండడు అన్నా!తెలుగులో బిజినెస్ గైడ్స్! Skill Based ఉద్యోగాలు!

ఏ పని తెలిసినా, ఏ జిల్లాలో ఉన్నా... మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం ఒకే చోట. వేలమంది ఉన్న మా కమ్యూనిటీ ద్వారా వచ్చిన ఉద్యోగ వివరాలను, మీ మీద బాధ్యతతో మేమిద్దరం స్వయంగా పరిశీలించి మీకు అందిస్తున్నాం. మా గురించి తెలుసుకోండి.

0ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు
0పని నైపుణ్యాలు
0జిల్లాలు
01

యజమానులను పరిశీలించాం

ఏ ఉద్యోగ వివరాలనైనా మీకు చూపించే ముందు మేము ఒకసారి పరిశీలిస్తాం.

02

మధ్యవర్తులు లేరు

ఉద్యోగం ఇచ్చే వారితో మీరే నేరుగా మాట్లాడవచ్చు. మధ్యలో ఏజెంట్లు ఉండరు.

03

ఒక్క రూపాయి ఖర్చు లేదు

ఇక్కడ ఉద్యోగం వెతకడానికి మీరొక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పటికీ ఉచితమే.

ఈరోజు కొత్తగా వచ్చిన ఉద్యోగాలు

సరికొత్త అవకాశాలు

మేము కొత్తగా తీసుకొచ్చిన అన్నిరకాల ఉద్యోగ అవకాశాలు

మీకు తెలిసిన పని ఎంచుకోండి

పని నైపుణ్యాన్ని బట్టి వెతకండి

ఎలక్ట్రికల్ పని నుంచి బేకరీ పని వరకు... మీకు ఏ పని వచ్చినా ఇక్కడ ఉద్యోగ అవకాశం వెతుక్కోవచ్చు.

మీ ఊరికి దగ్గర్లోనే పని

జిల్లాలవారీగా

మీకు దగ్గరలో ఉన్న ఉద్యోగావకాశాన్ని ఇక్కడ వెతకండి

మా సేవలు చేరిన ప్రాంతాలు

మీకోసం మేము తయారుచేసిన 13,427 సైన్యం

మీరుకూడా మాతో చేరాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇమెయిల్ చెయ్యండి.

ప్రత్యేక ఉద్యోగ అవకాశం

Loading...

ఏ పనికి ఎంత సంపాదించవచ్చు?

నెలవారీ సంపాదనకు ఒక ఉదాహరణ

మీరు ఎంతవరకు సంపాదించచ్చో... ఒక పట్టికలో

మూడు సులభమైన అడుగుల్లో ఉద్యోగం వెతకండి

ఉద్యోగం ఎలా వెతకాలి?

1

మీకు తెలిసిన పని ఎంచుకోండి

మీకు వచ్చిన పని లేదా మీ జిల్లాను ఎంచుకోండి.

2

పూర్తి వివరాలు చూడండి

జీతం ఎంత? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? చివరి తేదీ ఎప్పుడు? అన్ని వివరాలూ ఒకే చోట చూడండి.

3

నేరుగా ఫోన్ చేయండి

అప్లై బటన్ నొక్కి ఉద్యోగం ఇచ్చే వారితో నేరుగా మాట్లాడండి.

ఈ వారం ప్రత్యేక పని

ఎలక్ట్రీషియన్ పని

The most wanted skill this week.

రాష్ట్రవ్యాప్తంగా

అన్ని జిల్లాల ఉద్యోగ వివరాలు ఒకే మ్యాప్‌లో

ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఆ జిల్లాపై క్లిక్ చేయండి.

వెంటనే వెతకండి

మీకు తెలిసిన పనిని బట్టి ఉద్యోగాలు వెతకండి

గడువు త్వరలో ముగుస్తుంది

వెంటనే భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు

చివరి తేదీ దాటిపోకముందే ఉద్యోగానికి సంప్రదించండి.

0ఉద్యోగ అవకాశాలు
0అందుబాటులో ఉన్న అవకాశాలు
0ప్రస్తుతం కవర్ చేస్తున్న జిల్లాలు
0మేము అందించిన కెరీర్ గైడ్‌లు
మీ నైపుణ్యంతో ఎదగండి

హెల్పర్‌గా మొదలుపెట్టి సొంతంగా పని ఇచ్చే స్థాయికి ఎదగండి

ఈరోజు నిపుణులుగా ఉన్నవాళ్లు కూడా ఒకప్పుడు మొదటిసారి పని నేర్చుకున్నవాళ్లే. మీరు కూడా ఇలా ఎదగవచ్చు.

01

సహాయకుడు

పని చేస్తూనే నేర్చుకోండి. మొదటి రోజు నుంచే సంపాదించండి.

02

నైపుణ్యం ఉన్న పనివాడు

సొంతంగా పని పూర్తి చేయగలిగే స్థాయికి ఎదిగి, ఎక్కువ సంపాదించండి.

03

నిపుణుడు

ఒక బృందాన్ని నడిపించే స్థాయికి ఎదిగి, పెద్ద పనులు చేపట్టండి.

04

సొంత వ్యాపారం

మీకు వచ్చిన పనినే సొంత వ్యాపారంగా మార్చుకోండి.

మా ఉద్దేశం

మేమిద్దరం, మీకోసం!

మేము శివశంకర్, పింకీ శర్మ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన భార్యాభర్తలం. ఇద్దరం MBA చదువుకున్నాం. మా చుట్టూ ఎంతో పని తెలిసినవాళ్లు ఉన్నా, వారికి తగిన పని దొరక్క ఇబ్బంది పడటం చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగాం.

పని చేయగలిగిన నైపుణ్యం ఉన్నవాళ్లు ఖాళీగా ఉంటుంటే, మరోవైపు పని చేయించుకోవడానికి మనుషులు దొరకక యజమానులు వెతకడం మేము చూశాం. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, చివరికి ఉద్యోగం చూపించకుండా డబ్బులు తీసుకునే ఏజెంట్లను కూడా చూశాం. అందుకే ఈ వేదికను మొదలుపెట్టాం. మా వల్ల ఒకరికి ఈరోజు ఉద్యోగం దొరికి, రేపు ఉదయం నుంచే పనికి వెళ్లగలిగితే... అంతకంటే మాకు కావాల్సింది ఇంకేమీ లేదు. మా ప్రయాణం గురించి పూర్తిగా తెలుసుకోండి.

"ఇక్కడ మీరు చూసే ప్రతి ఉద్యోగ వివరాన్నీ మీకు అందించే ముందు మేమిద్దరం స్వయంగా పరిశీలిస్తాం."

శివ శంకర్, పింకీ శర్మ, వ్యవస్థాపకులు

0
నిజంగా ఉపయోగపడిన మా ప్రయత్నం

మా ద్వారా ఇప్పటికే ఉచితంగా సహాయం పొందినవారు.

ఈ వెబ్‌సైట్ ప్రారంభం కాకముందు నుంచే మేము ఉద్యోగం కోసం వెతికేవారికి నేరుగా సహాయం చేస్తున్నాం. గత ఏడాదిన్నర కాలంలో మా కమ్యూనిటీ ద్వారా 720 మందికి పైగా ఉద్యోగం, సరైన సలహా లేదా కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టే అవకాశం లభించింది. వారిలో ఒక్కరి దగ్గర కూడా మేము ఒక్క రూపాయి తీసుకోలేదు.

ఇప్పుడు ఇదే సహాయాన్ని ఆన్‌లైన్‌లో అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడున్నా మీ ఫోన్‌లోనే ఉద్యోగ వివరాలు తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలున్నాయా? మాతో మాట్లాడండి.

ఉద్యోగ సమాచారం మాకు ఎక్కడి నుంచి వస్తుంది?

ఉద్యోగ సమాచారం ఎన్నో చోట్ల నుంచి వస్తుంది. కానీ మీకు అందించే ముందు ప్రతి వివరాన్నీ పరిశీలిస్తాం.

ఉద్యోగ ఖాళీల వివరాలు యజమానులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు, కాంట్రాక్టర్లు, మా కమ్యూనిటీ సభ్యుల నుంచి మాకు అందుతాయి. Telegram, Instagram, WhatsApp, X, అలాగే మాకు నమ్మకమైన స్థానిక పరిచయాల ద్వారా వచ్చిన ఉద్యోగ వివరాలను సేకరించి, ప్రచురించే ముందు ఒక్కో వివరాన్నీ పరిశీలిస్తాం.

ఫ్యాక్టరీలుకంపెనీలుకాంట్రాక్టర్లుమా కమ్యూనిటీ సభ్యులుTelegramInstagramWhatsAppX
మేము గమనించిన సమస్య

అందరూ ఆఫీసు ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నారు. కానీ మన ఊళ్లలో పని తెలిసినవారికి ఉద్యోగాలు ఎలా దొరకాలనే విషయం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.

పెద్ద ఉద్యోగ వెబ్‌సైట్లు

  • ఆఫీసు, కార్పొరేట్ ఉద్యోగాలకే ఎక్కువ ప్రాధాన్యం
  • పెద్ద పెద్ద ఫారమ్‌లు, లాగిన్‌లు
  • రోజుకు ₹500 నుంచి ₹1,000 వచ్చే పనులకు సరైన చోటు లేదు
  • ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు సంబంధించిన ఉద్యోగాలు కనిపించవు
vs

మా ఉద్యోగ వేదిక

  • స్థానికంగా పని తెలిసినవారు, స్థానిక ఉద్యోగ యజమానులు
  • మా కమ్యూనిటీల నుంచి వచ్చిన నిజమైన ఉద్యోగ వివరాలు
  • పనివారికి, ఉద్యోగాలు ఇచ్చేవారికి పూర్తిగా ఉచితం
  • ప్రతి నెలా ఉద్యోగ వివరాలను కొత్తగా పరిశీలించి అప్డేట్ చేస్తాం
మా ప్రయాణం ఎలా మొదలై, ఎలా ఎదిగింది?

ఒక WhatsApp స్టేటస్‌తో మొదలై, వేలమందితో కూడిన కమ్యూనిటీగా ఎదిగిన ప్రయాణం

01

ఒక స్టేటస్‌తో మొదలు

మా ప్రాంతంలోని ఉద్యోగ ఖాళీల గురించి ఒక WhatsApp స్టేటస్ పెట్టాం. అది చాలామందికి చేరింది.

02

మరిన్ని వేదికలకు చేరాం

ఇతర సోషల్ మీడియా వేదికల్లోనూ ఉద్యోగ వివరాలు పంచుకున్నాం. చూసినవాళ్లు మరికొందరికి పంపుతూనే ఉన్నారు.

03

ఉద్యోగాలు ఇచ్చేవాళ్లు కూడా మాతో కలిశారు

ఫ్యాక్టరీ యజమానులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉద్యోగ యజమానులు మమ్మల్ని నేరుగా సంప్రదించడం మొదలుపెట్టారు.

04

మరింత మంచి వేదికను సిద్ధం చేయడానికి కొంత విరామం

గత ఒకటి, రెండు నెలలుగా ఉద్యోగ వివరాలు పోస్ట్ చేయడం కొంత తగ్గించి, మీకు మరింత ఉపయోగపడేలా ఈ మొత్తం వేదికను తయారు చేశాం.

05

మళ్లీ మీ ముందుకు వచ్చాం

రావడానికి కొంచెం సమయం పట్టి ఉండొచ్చు. కానీ మీకు అందించే ప్రతి సమాచారంలో నిజాయితీ, నమ్మకమే మా మొదటి ప్రాధాన్యం.

ఉద్యోగం కోసం చాలామంది మమ్మల్ని ఎందుకు సంప్రదిస్తున్నారు?

పనివారికీ ఉచితం. ఉద్యోగాలు ఇచ్చేవారికీ ఉచితం. రెండు వైపులా ఎలాంటి ఫీజు లేదు.

పనివారికి పూర్తిగా ఉచితం

ఉద్యోగం వెతకడానికి ఎప్పుడూ ఎలాంటి ఫీజు లేదు. మీరే ఉద్యోగ యజమానికి నేరుగా ఫోన్ చేయవచ్చు.

ఉద్యోగాలు ఇచ్చేవారికీ పూర్తిగా ఉచితం

మీ దగ్గర ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు మాకు పంపండి. మీ జిల్లాలో పని తెలిసినవారికి ఎలాంటి ఖర్చు లేకుండా చేరవేస్తాం.

పనివారికీ, ఉద్యోగాలు ఇచ్చేవారికీ మధ్య మేమొక వారధి

మా గ్రూపులు, కమ్యూనిటీల నుంచి వచ్చిన ఉద్యోగ వివరాలను సేకరించి మీ ముందుకు తీసుకొస్తాం.

ప్రతి నెలా కొత్త వివరాలు

ఉద్యోగ వివరాలను ప్రతి నెలా మళ్లీ పరిశీలించి అప్డేట్ చేస్తాం. ఫోన్ చేసే ముందు ప్రతి ఉద్యోగానికి ఇచ్చిన చివరి తేదీని తప్పకుండా చూడండి.

మా గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మా ప్రయాణం చదవండి లేదా మాతో మాట్లాడండి.

మీ దగ్గర ఉన్న ఉద్యోగ అవకాశాన్ని మాతో పంచుకోండి

మీ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా?

మీ కంపెనీ, ఫ్యాక్టరీ, నిర్మాణ స్థలం లేదా మీ బృందానికి పని తెలిసినవారు కావాలంటే మాకు వివరాలు పంపండి. మీ జిల్లాలోని వేలమందికి ఎలాంటి ఖర్చు లేకుండా ఆ ఉద్యోగ సమాచారం చేరవేస్తాం.

ఏ పని కోసం మనుషులు కావాలి? ఎక్కడ పని? జీతం ఎంత? మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఈ నాలుగు వివరాలు పంపిస్తే చాలు. ఇక్కడ మాకు వివరాలు పంపండి.

ఏ పని కోసం మనుషులు కావాలి?

చేయాల్సిన పని ఏమిటి? ఎంతమంది కావాలి?

పని చేసే ప్రాంతం

ఊరు, జిల్లా పేరు.

జీతం ఎంత?

రోజువారీ లేదా నెలవారీ జీతం వివరాలు.

సంప్రదించాల్సిన వ్యక్తి

ఉద్యోగం కోసం ఎవరికి ఫోన్ చేయాలో తెలియజేయండి.

మీకు మేమిచ్చే మాట

మా నుంచి మీరు ఎప్పుడూ ఆశించగలిగేది

ప్రతి ఉద్యోగానికి జీతం వివరాలు స్పష్టంగా ఉంటాయి. ప్రతి ఉద్యోగం వెనుక నిజమైన యజమాని వివరాలు ఉంటాయి. ప్రతిరోజూ కొత్త ఉద్యోగ వివరాలు చేరుస్తాం. 30 రోజులు దాటిన పాత ఖాళీలను తొలగిస్తాం. మీరు లేని ఉద్యోగం కోసం సమయం వృథా చేసుకోకూడదనేదే మా ఉద్దేశం.

ఏదైనా ఉద్యోగ సమాచారం తప్పుగా అనిపిస్తే వెంటనే మాకు తెలియజేయండి. అదే రోజు పరిశీలించి తగిన చర్య తీసుకుంటాం.

పరిశీలించిన వివరాలు

అందుబాటులో ఉన్న వివరాలను నిర్ధారించాం.

30 రోజుల వరకు

కొత్తగా ఉన్న ఉద్యోగ వివరాలకే ప్రాధాన్యం.

ఎలాంటి ఫీజు లేదు

ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎవరికీ డబ్బులు ఇవ్వకండి.

ఉచిత సహాయం

ఎప్పుడూ, అందరికీ ఉచితంగానే.

ఉద్యోగాలు ఇచ్చేవారి కోసం

మీదగ్గర ఉన్న ఉద్యోగ అవకాశాన్ని మాతో పంచుకోండి . .

పదిమంది కళ్ళల్లో వెలుగులు చూడటానికి మేము సిద్ధం. మరి మీరు?

మీ భద్రతే మాకు ముఖ్యం

ఉద్యోగ వివరాలను ఎలా పరిశీలిస్తాం?

1

ఉద్యోగ యజమాని వివరాల పరిశీలన

పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వివరాలను పరిశీలిస్తాం.

2

జీతం వివరాలు స్పష్టంగా

ప్రతి ఉద్యోగానికి సంబంధించిన జీతం వివరాలను ముందుగానే తెలియజేస్తాం.

3

ఉద్యోగం కోసం డబ్బులు చెల్లించకండి

ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే చెల్లించకండి.

4

సమస్య ఉంటే మాకు తెలియజేయండి

తప్పుగా ఉన్న ఉద్యోగ వివరాలను మాకు తెలియజేస్తే వాటిని తొలగిస్తాం.

మీ సందేహాలు

తరచూ మమ్మల్ని అడిగే ప్రశ్నలు

ఉద్యోగానికి అప్లై చేయడం ఉచితమేనా?

అవును. ఇక్కడ చూపించిన ఏ ఉద్యోగానికైనా అప్లై చేయడానికి ఎలాంటి ఖర్చు లేదు.

ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి?

మీకు నచ్చిన ఉద్యోగాన్ని తెరిచి వివరాలు చూడండి. తర్వాత అప్లై బటన్ నొక్కి ఉద్యోగ యజమానిని నేరుగా సంప్రదించండి.

కొత్త ఉద్యోగ వివరాలు ఎప్పటికప్పుడు చేరుస్తారా?

అన్ని పనులు, జిల్లాలకు సంబంధించిన కొత్త ఉద్యోగ వివరాలను ప్రతిరోజూ చేరుస్తాం.

ఒక ఉద్యోగ వివరాన్ని ఎంతకాలం ఉంచుతారు?

ఉద్యోగ వివరాలను ప్రకటించిన రోజు నుంచి 30 రోజుల వరకు ఉంచుతాం. ఆ తర్వాత పాత వివరాలను తొలగించి కొత్త ఉద్యోగాలకే అవకాశం కల్పిస్తాం.

నా దగ్గర ఉన్న ఉద్యోగ ఖాళీ వివరాలను మీకు పంపవచ్చా?

తప్పకుండా పంపవచ్చు. ఏ పని, ఏ ప్రాంతం, జీతం ఎంత, సంప్రదించాల్సిన వివరాలు మాకు పంపండి.

మా కమ్యూనిటీ

13,427 మంది. అందరి లక్ష్యం ఒక్కటే: పని తెలిసినవారికి సరైన అవకాశం అందించడం.

మా కమ్యూనిటీలు, ఉద్యోగ యజమానులు, X, స్థానిక పరిచయాల ద్వారా రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగ వివరాలు వస్తుంటాయి. వాటిని మీకు అందించే ముందు మేము పరిశీలిస్తాం.

0

Telegram

మా అతిపెద్ద గ్రూప్. ప్రతిరోజూ ఉద్యోగ వివరాలు, సలహాలు, మీ సందేహాలకు సమాధానాలు.

0

Instagram

రాష్ట్రవ్యాప్తంగా పని తెలిసినవారి నిజమైన అనుభవాలు, కొత్త వివరాలు, ఉద్యోగ అవకాశాలు.

0

WhatsApp

మీ ఊరికి దగ్గర్లో ఉన్న ఉద్యోగాల సమాచారం, వెంటనే అందే అలర్ట్‌లు, నేరుగా సహాయం.

మేము అందించే అన్ని పనుల వివరాలు

అన్ని రకాల పనులు ఒకే చోట

ఈరోజే మొదలుపెట్టండి

మీకు ఉన్న నైపుణ్యానికి తగిన ఉద్యోగ అవకాశం తప్పకుండా దక్కాలి.